![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -427 లో..... దీప దగ్గరికి జ్యోత్స్న వచ్చి తన తల్లిదండ్రులు ఎవరో తనకి తెలుసో లేదో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. కానీ దీప మాత్రం చాలా తెలివిగా తనని కన్నవాళ్ళ గురించి తెలిసిన కూడా దీప బయటపడదు. దేవుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుతాడు. ఏమో త్వరలోనే నా వాళ్ళకి దగ్గర చేయ్యొచేమోనని దీప అంటుంది.
దాంతో ఇది తెలిసి మాట్లాడుతుందా లేక తెలియక మాట్లాడుతుందా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు శివన్నారాయణకి ఏదో కొరియర్ వస్తుంది. అది ఓపెన్ చేసి చదివి షాక్ అవుతాడు. ఏమైంది పెద్దసారు అని కార్తీక్ అడుగుతాడు. మీ అమ్మ చేత నాకు ఆస్థిలో వాటా కావాలని నోటిస్ పంపిస్తావా అని కార్తీక్ పై కోప్పడతాడు శివన్నారాయణ. నేను పంపలేదని కార్తీక్ అంటాడు. మీ అమ్మ నీ సపోర్ట్ లేకుండా ఇలా చెయ్యదని శివన్నారాయణ అంటాడు. మొన్న ఎంగేజ్మెంట్ కి రానప్పుడే నాకు అర్ధం అయింది. వీళ్లకు ఆస్తులపై వ్యామోహం పెరిగిందని శివన్నారాయణ మాట్లాడతాడు. ఆ తర్వాత ఇది ఎవరో చేసారో నాకు తెలుసని దీప తో కార్తీక్ అంటాడు. వెంటనే శ్రీధర్ కి ఫోన్ చేస్తాడు. నోటిస్ వచ్చిందరా అని కార్తీక్ ని శ్రీధర్ అడుగుతాడు. హ వచ్చింది వాళ్ళు ఆస్తుల వాటా గురించి మాట్లాడతారట అని కార్తీక్ యాక్టింగ్ చేస్తూ మాట్లాడతాడు. నువ్వు చిన్నపిల్లాడివి నీకేం తెలియదు.. నేను వస్తున్నానని శ్రీధర్ అంటాడు.
ఆ తర్వాత కార్తీక్ ఈ నోటిసులు నేను పంపలేదని ఋజువు చేస్తానని శివన్నారాయణతో చెప్తాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ తన మాటలతో నేనే వాళ్లకు తెలియకుండా ఈ నోటిసులు పంపించానమి శ్రీధర్ చెప్పేలా చేస్తాడు. ఈ క్రెడిట్ మొత్తం నాకే.. న్యాయంగా నా భార్యకి వాటా రావాలి ఇవ్వండి అంటూ ఆస్తుల గురించి చెప్తుంటాడు. నీకేం వద్దా అని శివన్నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. ఇక ఇంట్లో అందరు.. శివన్నారాయణ చేతిలో నీకుంది రా అన్నట్లు చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |